అక్షరటుడే, ఇందూరు: Local body elections | స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లపై ప్రభుత్వ కసరత్తు కొలిక్కివచ్చింది. నిజామాబాద్ జిల్లాలో (Nizamabad) జెడ్పీటీసీ(ZPTC), ఎంపీపీ (MPP) స్థానాల రిజర్వేషన్లపై ఉత్కంఠతో ఎదురుచూస్తున్న రాజకీయ పార్టీ నాయకులకు ఊరట లభించింది.
Local body elections | నిజామాబాద్ జిల్లాలో..
జిల్లాలోని 31 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లు శనివారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సమక్షంలో ఖరారు చేశారు. ఇందులో మూడు ఎస్టీలకు, 5 ఎస్సీలకు, 10 జనరల్, 13 బీసీలకు కేటాయించారు.
Local body elections | 31 మండలాలకు సంబంధించి..
జిల్లాలో గతంలో 27 మండలాలు ఉండగా.. కొత్తగా ఆలూరు, డొంకేశ్వర్, సాలూర, పోతంగల్ నాలుగు మండలాలు ఏర్పడ్డాయి. దీంతో 31 మండలాలు ఉన్నాయి. కాగా.. మొత్తం 8,51,417 ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,96,778 మంది, మహిళలు 4,54,621 మంది ఉన్నారు.