అక్షరటుడే, ఇందూరు: BC Reservations | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని అన్ని పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ (BC JAC) ఆధ్వర్యంలో శనివారం బంద్ నిర్వహించి ధర్నా చౌక్‌లో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. న్యాయపోరాటం చేస్తున్న బీసీలకు అందరి మద్దతు ఉంటుందన్నారు.
కొందరు అగ్రవర్ణ కులస్తులు (upper caste people) కావాలని బీసీలకు వ్యతిరేకంగా కేసులు వేయడం తగదన్నారు. దీక్షలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, నూడా ఛైర్మన్ కేశ వేణు (NUDA Chairman Kesha Venu) , నరాల రత్నాకర్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, బీఎల్పీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్, మహిళా రాష్ట్ర నాయకులు సబ్బని లత తదితరులు పాల్గొన్నారు.
అలాగే మాల మహానాడు నాయకులు గైని గంగారం, దేవిదాస్, సీపీఐఎంఎల్ నాయకులు వనం కృష్ణ, సుధాకర్, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి రావు, ప్రజా హక్కుల సంఘం నాయకులు భాస్కర్, పీడీఎస్‌యూ నాయకులు గణేష్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, గంగా కిషన్, రవీందర్, వినోద్ కుమార్, దేవేందర్, శంకర్, అజయ్, శ్రీలత, విజయ్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.