అక్షరటుడే, ఇందూరు: NCC Certificate Exam | ఎన్సీసీ–ఏ సర్టిఫికెట్తో విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ వర్తిస్తుందని నిజామాబాద్ 12 తెలంగాణ ఎన్సీసీ బెటాలియన్ (Telangana NCC Battalion) కమాండింగ్ ఆఫీసర్ ప్రియాజిత్ సూర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని జీజీ కళాశాల(GG College) మైదానంలో ఆదివారం ఏ సర్టిఫికెట్ పరీక్షను నిర్వహించారు.
NCC Certificate Exam | ఎన్సీసీతో క్రమశిక్షణ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీసీలో చేరితే క్రమశిక్షణ ఐక్యత దేశభక్తి జాతీయత తదితర భావాలతో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగే అవకాశం ఉంటుందని కమాండింగ్ ఆఫీసర్ అన్నారు. పరీక్షను నిజామాబాద్, భిక్కనూరు (Bhikkanoor), బోధన్ (Bodhan), ముధోల్లో నిర్వహించామన్నారు. మొత్తం 1,074 విద్యార్థులకు గాను..1,057 మంది హాజరయ్యారని తెలిపారు. కార్యక్రమంలో సుబేదారి మేజర్ రాచపాల్ సింగ్, సునీల్ కుమార్, మహేందర్ శృంగేర్జిత్సింగ్, అనిల్ భగత్, హరిహిత్ సింగ్, షెల్కే మహదేవ్, ఎన్సీసీ ఆఫీసర్స్ లెఫ్ట్నెంట్ డాక్టర్ రామస్వామి, మధుబాబు, తారాచంద్, అనిల్ కుమార్, వీరేందర్ గౌడ్, ప్రమీల, నాగేశ్వరరావు, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.