అక్షరటుడే, ఇందల్వాయి: Bhupathi Reddy | సీఆర్ఆర్ 2025–2026 నుంచి నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (Rural MLA Bhupathi Reddy) జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కను (Minister Seethakka) కోరారు. నియోజకవర్గంలో 170 పంచాయతీలు, ఏడు మండలాలు ఉన్నాయన్నారు.
గ్రామాలకు బీటీ రోడ్లు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆయన వివరించారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. దీనికి సంబంధించి సీఆర్ఆర్ నిధులు (CRR funds) మంజూరు చేయాలని మంత్రిని కోరారు. రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల అంచనా వ్యయంతో కూడిన పనులకు నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించి, త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
