అక్షరటుడే, బాన్సువాడ: Banswada | మోస్రా మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని తహశీల్దార్ రాజశేఖర్‌ను (Tahsildar Rajasekhar) బీజేపీ నాయకులు కోరారు. ఈ మేరకు ఆయనను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు.
మోస్రా వెంకటేశ్వర ఆలయం (Mosra Venkateswara Temple) నుంచి కుర్నాపల్లి రోడ్డు వరకు, చింతకుంట రోడ్డు నుంచి గోవూర్ కాంట వరకు రోడ్డు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అలాగే మండలంలోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు. అంతకుముందుకు తహశీల్దార్‌ను బీజేపీ నాయకులు (BJP leaders) సన్మానించారు.
కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు సురే గణేష్, సుంచు హన్మగౌడ్, పీఏసీఎస్ ఛైర్మన్ గుత్పే జగన్మోహన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ బొజ్జ సుదర్శన్ గౌడ్, భూపాల్ రెడ్డి, రాజా రెడ్డి, మాజీ వార్డు సభ్యులు లింగం, పీఏసీఎస్ డైరెక్టర్లు లక్ష్మా రెడ్డి, గంగారెడ్డి, సంగ అనిల్, కొమిరె సాయిలు, వినోద్, పోతన్న, శ్రీహరి గౌడ్, అభిలాష్ గౌడ్, శ్యాం, లక్ష్మీనారాయణ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, నరేందర్, శేఖర్ గౌడ్, ప్రశాంత్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.