అక్షరటుడే, వెబ్డెస్క్ : Railway Passengers | హైదరాబాద్ (Hyderabd) నుంచి ఢిల్లీ (Delhi)కి ప్రత్యేక రైలు నడపాలని ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు ఫణి కోరారు. ఈ మేరకు ఆయన దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే నిలయంలో సీపీటీఎం (CPTM) రవి చందర్ని కలిసి వినతి పత్రం అందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తవుతున్నా.. రాష్ట్రం పేరుతో ఢిల్లీకి ప్రత్యేక సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు లేదన్నారు. తెలంగాణ సంపర్క్ క్రాంతి రైలును హైదరాబాదు నుంచి కామారెడ్డి – నిజామాబాదు – కరీంనగర్ – పెద్దపల్లి – మంచిర్యాల మార్గంలో ఢిల్లీకి నడపాలని కోరారు.
పెద్దపల్లి జంక్షన్లో 12643/44 తిరువనంతపురం స్వర్ణజయంతి వీక్లీ, 12252 వైన్ గంగా బై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు, ఓదెలలో 12762/61 కరీంనగర్ నుంచి తిరుపతి బై వీక్లీ సూపర్ ఫాస్ట్, 12803/04 విశాఖపట్నం స్వర్ణ జయంతి బై వీక్లీ సూపర్ ఫాస్ట్ రైలును మంచిర్యాలలో ఆపాలని కోరారు.
Railway Passengers | ఆ రైళ్లను పొడిగించాలి
బల్లార్షా నుంచి కాజీపేట ఎక్స్ప్రెస్ రైలును చర్లపల్లి వరకు, కాచిగూడ– కరీంనగర్ డెము రైలును పెద్దపల్లి వరకు, తిరుపతి – కరీంనగర్ (Karimnagar) రైలును నిజామాబాద్ వరకు పొడిగించాలని కోరారు. రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను బోధన్ వరకు, నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ రైలును కాజీపేట వరకు పొడిగించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.