అక్షరటుడే, వెబ్డెస్క్ : Special Trains | రద్దయిన రైళ్లను పునరుద్ధరించాలని ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం సభ్యులు కోరారు. ఈ మేరకు సికింద్రాబాద్ (Secunderabad) రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ సీపీటీఎం రవి చందర్ (CPTM Ravi Chander)ను కలిసి వినతి పత్రం అందించారు.
గత 9 నెలల క్రితం వరకు నడిచి రద్దయిన 07196/95 కాజీపేట – దాదర్ ముంబాయి (వయా పెద్దపల్లి – నిజామాబాద్), కాజీపేట నుంచి దాదర్ ముంబాయి 07197/98 (వయా పెద్దపల్లి – మంచిర్యాల – సిర్పూర్ కాగజ్ నగర్ – బల్లార్షా – ఆదిలాబాద్) వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైళ్లను (Special Express Trains) పునరుద్ధరించి కోరారు. వీటిని క్రమబద్ధీకరించడంతో పాటు ఇరు మార్గాల్లో వారానికి కనీసం మూడు రోజులు నడిపితే ఉత్తర తెలంగాణ నుంచి ముంబయి, షిరిడీ వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని వివరించారు.