అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Padmashali Sangham | పట్టణ పద్మశాలి కమిటీ ప్రతినిధులు గురువారం ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఎంపీ కార్యాలయంలో (MP Dhrmapuri Arvind) మర్యాదపూర్వకంగా కలిశారు. బోర్గాం(పి) (Borgham(P)) శివారులో పద్మశాలి కులస్థులకు చెందిన స్థలంలో కల్యాణమండపం (Wedding hall) నిర్మాణానికి నిధులు ఇవ్వాలని ఆయనను కోరారు.
కల్యాణమండపం, కొత్త తర్పలకు స్థలాలు ఉన్నవారికి రూ.7లక్షల చొప్పున ఎంపీ ఫండ్ ఇవ్వాలని వారు ఎంపీకి విజ్ఞప్తి చేశారు. ఎంపీ అర్వింద్ సానుకూలంగా స్పందించి కల్యాణ మండపం నిర్మాణంతో పాటు తర్పలు, సంఘాల భవన నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
ఎంపీని కలిసిన వారిలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు పెంట దత్తాద్రి, ప్రధాన కార్యదర్శి చౌకి భూమేశ్వర్, ప్రతినిధులు భూస రవి, బొట్టు వెంకటేష్, ఇప్పకాయల కిషోర్, కోడూరు నాగరాజ్, పుట్ట వీరేందర్, పల్నాటి కార్తిక్, ఆశిష్ తదితరులున్నారు.