అక్షరటుడే, ఆర్మూర్: Armoor constituency | ఆర్మూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి (Armoor In-charge Vinay Reddy) కోరారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకు (Minister Seethakka) ఆదివారం వినతిపత్రం అందజేశారు.
Armoor constituency | రోడ్లు బాగాలేక అవస్థలు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు బాగా లేనందున ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. లోలెవెల్ వంతెనల కారణంగా వర్షాకాలంలో (rainy season) పలు మార్గాల్లో ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
Armoor constituency | దెబ్బతిన్న రోడ్లు ఇవే..
ఆలూర్ మండలం గుత్ప, కల్లెడి గ్రామాల మధ్య వంతెన నిర్మాణం కోసం రూ.2.50కోట్లు, మాక్లూర్ మండలం మెట్టు, గొట్టిముక్కలను కలుపుతూ లక్మాపూర్ వరకు సుమారు 1.6 కిలోమీటర్ రోడ్డు కోసం రూ.1.52 లక్షలు, మాక్లూర్ మండల కేంద్రం, మాక్లూర్ ఎస్సీ కాలనీ నుంచి ముల్లంగి వరకు 1.5 కిలోమీటర్ల రోడ్డు కోసం రూ.1.42 కోట్లు, ఆర్మూర్ మండలం మంథని గ్రామం నుంచి రామ్ పూర్ వరకు 4.95 కి.మీ రోడ్డుకు రూ.4.70 కోట్లు, డొంకేశ్వర్ మండలం మారంపల్లి ఆర్అండ్బీ రోడ్ నుంచి డొంకేశ్వర్ పీఆర్ రోడ్డు వరకు 3.70 కి.మీ రోడ్డును రూ.3.51కోట్లు, నందిపేట్ మండలం కుద్వాన్పూర్ గ్రామంలో నందిపేట్ మెయిన్ రోడ్డు నుంచి ఎల్లమ్మ మందిరం వరకు ఘాట్ రోడ్డు కోసం సుమారు 1.5 కి.మీ కోసం రూ.1.42 కోట్లు మంజూరు చేయాలని కోరారు. దీనిపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారని తెలిపారు.