అక్షరటుడే, వెబ్‌డెస్క్: Republic TV Arnab Goswami | ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ ఇటీవల ఒక జాతీయ మీడియా చర్చలో పాల్గొనడానికి నిరాకరించారు. ఆ ఛానెల్‌ను బాయ్‌కాట్ చేశారు. భారత్‌లో ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభంపై రిపబ్లిక్ టీవీలో అర్నబ్ గోస్వామి చర్చా కార్యక్రమం తలపెట్టారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను ఆహ్వానించారు. కానీ, ఈ చర్చకు హాజరుకావడానికి బదులుగా, ఆయన ఛానెల్‌ను బాయ్‌కాట్ చేసినట్లుగా ప్రచారంలో ఉంది.
Republic TV Arnab Goswami | ఖాళీ చైర్..
కాగా, డిబేట్ కార్యక్రమంలో అర్నబ్ గోస్వామి.. టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కోసం ఖాళీ చైర్‌ను కేటాయించారు. ఇలా కార్యక్రమంలో ఖాళీ చైర్ కేటాయించడం వివాదాస్పదంగా మారింది. దీనికితోడు లోకేష్ వ్యవహారశైలిని ఆర్నబ్ తీవ్రంగా విమర్శించారు.
విమాన ప్రయాణికుల సమస్యలను తెలుసుకోవడానికి లోకేష్‌కు ఫోన్ చేసినప్పుడు ఆయన నిర్లక్ష్యంగా ‘హలో హలో’ అంటూ ఫోన్ పెట్టేశారని ఆర్నబ్ పేర్కొన్నారు. ఇది బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా.. రిపబ్లిక్ టీవీ డిబేట్‌ను ఒక్క తెలుగుదేశం పార్టీనే కాదు.. ఈ టీవీని గతంలోనూ వివిధ కారణాలతో పలు ప్రతిపక్ష పార్టీలు బాయ్‌కాట్ చేయడం గమనార్హం.