అక్షరటుడే, కామారెడ్డి: Republic Day | జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవానికి (Republic Day) అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వేదికతో పాటు పోలీసుల పరేడ్, స్టాల్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు కలెక్టర్ క్యాంప్ కార్యాలయం, 8:20 గంటలకు కలెక్టరేట్, 8:40 గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.
Republic Day | కలెక్టర్ ఆధ్వర్యంలో..
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) జాతీయ పతాకాన్ని 9 గంటలకు ఆవిష్కరించనున్నారు. 9:10 గంటలకు పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం కలెక్టర్ ప్రసంగించనున్నారు. 9:45 గంటల నుంచి 10:15 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం వికలాంగులకు ల్యాప్టాప్స్, స్మార్ట్ఫోన్ల పంపిణీ చేపట్టనున్నారు. తర్వాత ఉత్తమ అధికారులకు ప్రశంసాపత్రాలు అందించనున్నారు. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కలెక్టర్ పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్పీ రాజేష్ చంద్ర నేతృత్వంలో ముందుగానే వేడుకలు నిర్వహించనున్న స్టేడియంను అణువణువు తనిఖీలు నిర్వహించారు. సోమవారం సైతం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.