అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Republic Day | టీఎన్జీవోస్ నిజామాబాద్ (TNGOs Nizamabad) ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని టీఎన్జీవోస్ భవన్ (TNGOs Bhavan) ఆవరణలో ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ (Nashetti Suman Kumar) జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం సుమన్ కుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు, జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విధినిర్వహణలో అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చడంలో ఉద్యోగులే కీలకమన్నారు. అలాగే రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే బాధ్యత సైతం ప్రభుత్వంపై ఉందన్నారు.
Republic Day | సుదర్శన్ రెడ్డిని కలిసిన టీఎన్జీవోస్ నేతలు..
ప్రభుత్వ ముఖ్య సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని నగరంలోని ఆయన స్వగృహంలో టీఎన్జీవోస్ నేతలు (TNGOs Leaders) మర్యాదపూర్వకంగా కలిశారు. టీఎన్జీవోస్ పక్షాన.. ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ పూల మొక్కను అందజేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, జిల్లా సహాధ్యక్షుడు చిట్టి నారాయణ రెడ్డి , రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణ్రెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా ముఖ్య సలహాదారు వనమాల సుధాకర్, కేంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
