అక్షరటుడే, వెబ్‌డెస్క్: Republic Day | దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) జాతీయ జెండా ఎగుర వేశారు.ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో గణతంత్ర వేడుకలు నిర్వహించారు.
పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాలు ప్రకటించిన శకటాలు ఆకట్టుకున్నాయి. వైమానిక దళం విన్యాసాలు అబ్బుర పరిచాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం థీమ్ “150 సంవత్సరాల వందేమాతరం”. భారతదేశం తన అభివృద్ధి ప్రయాణం, సాంస్కృతిక వైవిధ్యం, సైనిక శక్తిని కవాతులో ప్రదర్శిస్తుంది.
Republic Day | రాష్ట్రంలో..
సికింద్రాబాద్-పరేడ్ గ్రౌండ్స్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) జాతీయ జెండా ఎగుర వేశారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో రూపొందించిన శకటాలను ప్రదర్శించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ (Speaker Gaddam Prasad), శాసన మండలిలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ వేడులకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.
Republic Day | శుభాకాంక్షలు తెలిపిన మోదీ
ప్రధాని మోదీ (Prime Minister Modi) గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణానికి సమష్టిగా ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.