Republic Day celebrations | దేశ రాజధాని national capital ఢిల్లీ Delhi లో ఈసారి (2026) జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. సైలెంట్ వారియర్స్ పేరుతో ఉన్న ఇండియన్ ఆర్మీ జంతు దళం ఈ పరేడ్‌లో తొలిసారిగా పాల్గొనబోతోంది. రిమౌంట్ అండ్ వెటర్నరీ కోర్ (RVC)కు చెందిన యానిమల్స్ దళం కవాతు చేయబోతోంది.
Republic Day celebrations | ఒంటెలు, గుర్రాలు..
చలి తీవ్రత ఎక్కవగా ఉండే హిమాలయాల్లో మన సైనికులకు ఈ జంతువులు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న లద్దాఖ్ వంటి శీతల ఎడారుల్లో Bactrian camelsబాక్ట్రియన్ ఒంటెలు ప్రయాణిస్తాయి. ఇప్పుడు ఈ ఒంటెలే పరేడ్‌కు నాయకత్వం వహించనున్నాయి. ఈ ఒంటెలు సుమారు 250 కిలోల వరకు బరువును మోయగలవు.
ఇక లద్దాఖ్‌లోని జాంస్కరీ గుర్రాలు Zanskari horses మైనస్ 40 డిగ్రీల చలిలో సైతం అత్యంత చురుగ్గా ప్రయాణిస్తాయి. పర్వత ప్రాంతాల్లో ఉన్న సైనికులకు సరకులు చేరవేయడంలో ఇవి కీలకంగా పనిచేస్తున్నాయి. నిఘాతోపాటు శత్రు డ్రోన్లను కూల్చివేయడంలో శిక్షణ పొందిన డేగలు సైతం పరేడ్‌లో పాల్గొంటున్నాయి. ఇక పది స్వదేశీ జాతుల శునకాలు రాంపూర్ హౌండ్, ముధోల్ హౌండ్ సహా ఆరు విదేశీ జాతుల జాగిలాలు కూడా ప్రదర్శనలో ఉండనున్నాయి. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ ఇప్పటికే రిహార్సల్స్ చేస్తోంది.