ePaper
More
    HomeతెలంగాణCollector Nizamabad | సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు నివేదికలు అందించాలి

    Collector Nizamabad | సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు నివేదికలు అందించాలి

    Published on

    అక్షర టుడే, ఇందూరు: Collector Nizamabad | జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల భవనాలపై సోలార్‌ పవర్‌ (Solar Power) పరికరాల ఏర్పాటుకు శాఖల వారీగా వెంటనే నివేదికలు అందించాలని కలెక్టర్‌ టి వినయ్‌ కృష్ణారెడ్డి (Collector T Vinay Krishna Reddy) ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

    అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, గురుకులాల భవనాలపై సౌర విద్యుత్‌ ఫలకాల ఏర్పాటు, నీటి పారుదల, మిషన్‌ భగీరథ శాఖలకు (Mission Bhagiratha Branch) చెందిన ఖాళీ స్థలాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు వీటి ఏర్పాటుకు సంబంధించి నివేదికలు రూపొందించి, మంగళవారం సాయంత్రం అందించాలన్నారు. పరికరాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, విద్యుత్‌ కనెక్షన్, తదితర వివరాలను నివేదికలో పొందుపర్చాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ అంకిత్ (Additional Collector Ankit), ట్రెయినీ కలెక్టర్‌ కరోలిన్‌ చింగ్తియాన్మావి, డీఆర్డీవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వర్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    TPCC Legal Cell | న్యాయవాదుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా..

    అక్షరటుడే, కామారెడ్డి: TPCC Legal Cell | న్యాయవాదుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని టీపీసీసీ రాష్ట్ర లీగల్...

    Nizamabad City | ఎస్సీ ఎస్టీ కేసులో పలువురికి జైలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | ఎస్సీ ఎస్టీ కేసులో (SC/ST case) ముగ్గురికి జైలుశిక్ష విధిస్తూ...

    Kota Srinivas Wife | కోట మ‌ర‌ణించిన కొద్ది రోజులకే ఆయ‌న భార్య క‌న్నుమూత‌.. శోక సంద్రంలో కుటుంబ స‌భ్యులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kota Srinivas Wife | విల‌క్ష‌ణ న‌టుడు కోట శ్రీనివాస రావు (Kota Srinivasa...

    Umamaheswara Temple | గోదావరికి భారీ వరద.. గంగమ్మ ఒడిలో ఉమామహేశ్వరాలయం…

    అక్షరటుడే, ఆర్మూర్: Umamaheswara Temple | ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నిజాంసాగర్...

    More like this