అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rajendra nagar | కామారెడ్డి kamareddy జిల్లాలోని ఓ ఎమ్మెల్యేను MLA బ్లాక్ మెయిల్ blackmail చేసిన రిపోర్టర్ reporterను పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు రిపోర్టర్ ఎమ్మెల్యేను కలిసి కొన్ని వీడియోలు ఉన్నాయని చెప్పి, డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. రూ.ఐదు కోట్లు ఇవ్వకపోతే వాటిని బయట పెడతానని శ్యామ్ అనే రిపోర్టర్ బ్లాక్ మెయిల్ చేశాడు. శ్యామ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న MLC Tenmaar Mallanna దగ్గర రిపోర్టర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఎమ్మెల్యే రాజేంద్రనగర్ rajendra nagar పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సదరు రిపోర్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఉప్పర్‌పల్లి upparpalli మెట్రోపాలిటన్ కోర్టులోని జడ్జి ఎదుట ప్రవేశ పెట్టారు.