అక్షరటుడే, ఆర్మూర్: Armoor Police | ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, ఈవ్ టీజింగ్ చేసినా వెంటనే షీటీంకు సమాచారం ఇవ్వాలని ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ (Armoor SHO Satyanarayana Goud) అన్నారు. పట్టణంలోని మహిళా జూనియర్ కళాశాలలో (Women’s Junior College) విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
Armoor Police | సమచారమిచ్చిన వారి పేర్లు గోప్యంగా..
సబ్ డివిజన్ షీటీం కానిస్టేబుళ్లు, విగ్నేష్, సుమతి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎస్‌హెచ్‌వో మాట్లాడుతూ.. ఈవ్‌టీజీంగ్ చట్టరీత్యా నేరమన్నారు. విద్యార్థినులు, ఉద్యోగినులు, మహిళలు ఈవ్‌టీజింగ్, వేధింపులకు గురైతే పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.
Armoor Police | రక్షణ కల్పిస్తాం..
ఈవ్ టీజింగ్‌కు గురయ్యేవారు భయపడకుండా సమాచారం ఇస్తే పోలీస్‌శాఖ తరపున రక్షణ కల్పిస్తామన్నారు. షీటీం నంబర్ 8712659795కు, డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. క్యూఆర్ కోడ్ ద్వారా షీ టీంకు ఫిర్యాదు చేసే విధానాన్ని విద్యార్థినులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ ఎంఎస్వీ ప్రసాద్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.