అక్షర టుడే, ఇందూరు : Collector Nizamabad | భవిత కేంద్రాల మరమ్మతులు నాణ్యతతో చేపట్టాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని శంకర్ భవన్ ఆవరణలో గల భవిత కేంద్రాన్ని (Bhavitha Kendram) శనివారం సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మరమ్మతుల కోసం అవసరమైతే మరిన్ని నిధులు జిల్లా యంత్రాంగం తరపున సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పనుల నాణ్యతలో రాజీ పడకూడదని తెలిపారు. అనంతరం శంకర్ భవన్ ఉన్నత పాఠశాలను (Shankar Bhavan High School) తనిఖీ చేశారు.
విద్యార్థులు ఉపాధ్యాయుల హాజరు ముఖ గుర్తింపు విధానంలో అమలు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. వంద శాతం ఎఫ్ఆర్ఎస్ విధానంలోనే హాజరు ఉండాలని స్పష్టం చేశారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు నిర్వహిస్తున్న కిచెన్ గార్డెన్, హెర్బల్ గార్డెన్ పరిశీలించి అభినందించారు. కలెక్టర్ వెంట ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఉదయ్ కిరణ్, ఎంఈవో సాయ రెడ్డి, భవిత కేంద్రాల ఇన్ఛార్జి ప్రకాశ్, సీఎంవో శ్రీనివాస్ తదితరులున్నారు.
