అక్షరటుడే, వర్ని: Highway Roads | బాన్సువాడ నుంచి నిజామాబాద్‌కు వెళ్లే రహదారిపై (Nizamabad banswada Road) కొన్నినెలలుగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేయాలని బీజేపీ (BJP Mosra) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం మోస్రా మండల కేంద్రంలో రహదారిపై ధర్నా చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఆర్నెళ్ల క్రితం రహదారి మరమ్మతులు ప్రారంభించి నిర్లక్ష్యంగా వదిలేశారన్నారు. దీంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించారు.
కాంట్రాక్టర్ కారణంగా ఇప్పటికే అనేకమంది రహదారిపై గాయాలపడ్డారని వారు వాపోయారు. రాబోయే వారం రోజుల్లో రోడ్డు పనులు పూర్తిచేయకుంటే పెద్దఎత్తున నిరసనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి హన్మాగౌడ్, ఉపసర్పంచ్ సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు లక్ష్మణ్ రాజ్ రెడ్డి, సాయిలు, లింగం, శ్రీహరి, యోగి శ్రీను, అనిల్, లక్ష్మీనారాయణ, నవీన్ రెడ్డి, నర్సారెడ్డి పిట్ల శేఖర్, శేఖర్ గౌడ్, రాజారెడ్డి, యశోద మధు, రవీందర్ గౌడ్, నరేందర్, బీజేపీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.