అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | జూనియర్ కళాశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల నేతృత్వంలో మరమ్మతులు చేపట్టాలని ఇంటర్ బోర్డు జిల్లా ప్రత్యేక అధికారి ఒడ్డెన్న (Inter Board District Special Officer Oddenna) తెలిపారు. జిల్లా ఇంటర్ విద్య కార్యాలయంలో శనివారం అన్ని కళాశాలల (District Inter Education Office) ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ బోర్డు కేటాయించిన నిధులను వినియోగించడానికి అమ్మ ఆదర్శ కమిటీ ఛైర్పర్సన్లు (Amma Adarsh Committee chairpersons), ప్రిన్సిపాళ్ల పేరుపై జాయింట్ అకౌంట్ తెరవాలని సూచించారు. విద్యార్థుల ఫేషియల్ రికగ్నీషన్ సిస్టం (facial recognition system) ద్వారా ఆన్లైన్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాలలో చేరిన విద్యార్థుల డేటాను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయడంతో పాటు యూ డైస్ పూర్తి చేయాలనిచెప్పారు. అలాగే వారంలో ఒకరోజు కచ్చితంగా క్రీడలను నిర్వహించాలని సూచించారు. అంతకుముందు డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమావేశంలో జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ పాల్గొన్నారు.