అక్షరటుడే, వెబ్‌డెస్క్: Swami Sivananda Saraswati | ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద సరస్వతి (Swami Sivananda Saraswati) ఆదివారం మృతి చెందారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ(PM Modi), యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో (UP CM Yogi Adityanath) సహా పలువురు సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘యోగా సాధకుడు, కాశీ(Kashi) నివాసి అయిన శివానంద్ బాబాజీ మరణవార్త వినడం చాలా బాధాకరం.. శివానంద్ బాబా శివలోకానికి బయలుదేరడం కాశీ నివాసితులందరికీ ఆయన నుంచి ప్రేరణ పొందే లక్షలాది మందికి తీరని లోటు” అని ట్వీట్ చేశారు.
Swami Sivananda Saraswati | స్వామి శివానంద సరస్వతి ఎవరంటే..
స్వామి శివానంద సరస్వతి ఆగస్టు 8, 1897న అవిభక్త భారతదేశంలో (ఇప్పుడు బంగ్లాదేశ్)లోని సిల్హేట్ జిల్లాలో జన్మించారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆయనను పశ్చిమ బెంగాల్‌లోని నబద్వీప్‌లోని గురూజీ ఆశ్రమానికి బంధువులు తీసుకొచ్చారు. ఆ తర్వాత, ఆయనను గురు ఓంకారానంద గోస్వామి పెంచి పెద్ద చేశారు. ఆయన అధికారిక విద్య లేకుండానే యోగాతో సహా అన్ని ఆచరణాత్మక మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్వామి శివానందనకు అందించారు.
Swami Sivananda Saraswati | 2022లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం..
2022లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ యోగా రంగంలో స్వామి శివానంద చేసిన అసాధారణ కృషికి గాను ప్రతిష్టాత్మక పౌర పురస్కారమైన పద్మశ్రీని ప్రదానం చేశారు. 2025లో స్వామి శివానంద వందేళ్ల తర్వాత మహాకుంభమేళాలో పాల్గొంటున్నట్లు తెలియగానే మరోసారి వార్తల్లో నిలిచారు.
Swami Sivananda Saraswati | కుష్టువ్యాధులకు విశేష సేవ..
యోగా శిక్షణలో విశేష కృషితో పాటు స్వామి శివానంద 400 నుంచి 600 మంది కుష్టు వ్యాధిగ్రస్తులైన యాచకులకు సేవ చేశారు. ఆయన వారి గుడిసెలకు వెళ్లి స్వయంగా వారికి కావాల్సిన అవసరాలను తీర్చేవారు. 2019లో యోగా రత్న అవార్డు సైతం అందుకున్నారు.
