అక్షరటుడే, వెబ్‌డెస్క్: Siddharth Bhaiya | ప్రఖ్యాత పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్) నిర్వాహకుడు, ఏక్విటాస్ ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సిద్ధార్థ భయ్యా (47) కన్నుమూశారు. న్యూజిలాండ్‌లో (New Zealand) కుటుంబ సభ్యులతో విహారయాత్రలో ఉన్న సమయంలో గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఏక్విటాస్ సంస్థ ధ్రువీకరించింది.
Siddharth Bhaiya | సిద్ధార్థ భయ్యా నేపథ్యం..
చార్టర్డ్ అకౌంటెంట్ అయిన సిద్ధార్థ భయ్యాకు ఈక్విటీ రీసెర్చ్, ఫండ్ మేనేజ్మెంట్ రంగాల్లో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ పీఎంఎస్ విభాగంలో 2011 వరకు అతిచిన్న వయసులో ఫండ్ మేనేజర్‌గా పనిచేశారు. 2013లో ఏక్విటాస్ను (Equitas) స్థాపించారు. బాటమ్-అప్ స్టాక్ ఎంపిక, చిన్న కంపెనీలలో అవకాశాలు, మల్టీబ్యాగర్ రాబడులపై దృష్టి సారించి సంస్థను నడిపారు. జనవరి 2026 నాటికి ఏక్విటాస్ ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెన్సీ (Equitas Investment Consultancy)కి సుమారు రూ.7,700 కోట్ల ఆస్తులు ఉన్నాయి.
Very very sorry to see the news of Siddhartha Bhaiya – Uffffffffffffff.
Oh God.— Samir Arora (@Iamsamirarora) January 2, 2026
Siddharth Bhaiya | ఏక్విటాస్ సంస్థ ప్రకటన
సిద్ధార్థ భయ్యా మరణంపై ఏక్విటాస్ స్పందించింది. సిద్ధార్థ దార్శనిక పెట్టుబడిదారుడు మాత్రమే కాకుండా సంస్థల నిర్మాత కూడా అని తెలిపింది. నిజాయితీ, క్రమశిక్షణతో కూడిన నిర్ణయాలు, దీర్ఘకాలిక ఆలోచనలకు ఆయన ఎప్పుడూ కట్టుబడి ఉంటారని పేర్కొంది. “ఆయన నుంచి నేరుగా నేర్చుకునే అవకాశం మాకు లభించింది. ఆయన ప్రభావం మా ఆలోచనలు, చర్యలు, పెట్టుబడులపై కొనసాగుతుంది” అని సంస్థ పేర్కొంది. ఆయన స్థాపించిన సూత్రాలు, సంస్థకు కట్టుబడి ఉంటామని, ఆయన ఊహించిన విధంగా పెట్టుబడిదారులకు సేవలు అందిస్తామని ఏక్విటాస్ తెలిపింది.