అక్షర టుడే, బోధన్: Renjal Mandal | రెంజల్ మండల మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలకు చెందిన స్ఫూర్తి (Sphoorti) అనే విద్యార్థిని బాల్ బ్యాడ్మింటన్ జాతీయ పోటీలకు (national ball badminton competitions) ఎంపికయింది.
ఇటీవల ఆసిఫాబాద్(Asifabad)లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచింది. దీంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ భాగ్యశ్రీ, పిఈటి శ్యామల తెలిపారు. జాతీయ స్థాయి క్రీడ పోటీలకు ఎంపికైన విద్యార్థిని స్ఫూర్తి ని పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్షియా నజమ్, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.