అక్షరటుడే, ఇందూరు: BJYM Nizamabad | నగరంలోని వాణిజ్య సంస్థలకు నిజామాబాద్ పేరు (Nizamabad Name) తొలగించి ఇందూరు పేరు పెట్టుకోవాలని బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అమంద్ విజయ్ కృష్ణ సూచించారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని పలు వ్యాపార సంస్థల బోర్డులపై ఇందూరు (Indur) పేరుతో స్టిక్కర్లను అతికించారు.
BJYM Nizamabad | ఇందూరు.. సంస్కృతికి ప్రతీక..
ఈ సందర్భంగా అమంద్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ.. ఇందూరు అనేది ఒక పేరు మాత్రమే కాదని.. ఈ ప్రాంత ప్రజల చరిత్ర, సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు. ఓటరు ముసాయిదా జాబితాలో తప్పులకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో (Municipal Corporation office) సోమవారం సమావేశం జరుగగా ఎంఐఎం నాయకులు ‘ఇందూరు కాదు నిజామాబాద్’ అంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మాస్టర్ శంకర్, దాత్రిక రమేష్, బూరుగుల వినోద్, 36వ డివిజన్ ఇన్ఛార్జి మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.