అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో ఏ వీధిలో చూసినా విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్లు కనిపిస్తాయి. ఇంటర్ నెట్, టీవీ కేబుల్ వైర్ల (TV Cable Wires) చుట్టలు వేలాడుతూ ప్రమాదకరంగా ఉంటాయి. దీంతో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
నగరంలోని రామాంతపూర్‌లో ఇటీవల శ్రీకృష్ణుడి రథాన్ని (Lord Krishna Chariot) లాగుతుండగా.. విద్యుత్ షాక్‌తో ఆరుగురు మృతి చెందారు. విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లతో ప్రమాదం జరిగినట్లు విద్యుత్ శాఖ అధికారులు (Electricity Department Officers) తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో అనుమతి లేకుండా విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేసిన కేబుల్ వైర్లను తొలగించాలని ఆయన ఆదేశించారు.
Hyderabad | వరుస ఘటనలతో అప్రమత్తం
రామాంతపూర్ (Ramantapur) ఆరుగురు మృతి చెందిన విషయం మరువక ముందే బండ్లగూడ రోడ్డు వద్ద గణేష్ విగ్రహాన్ని మండపానికి తరలిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృతి చెందారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టి (Deputy CM Bhatti Vikramarka) విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. విద్యుత్ స్తంభాలపై ఏర్పాటు చేసిన కేబుళ్లను తొలగించాలని ఏడాది సమయం ఇచ్చినా ఆపరేటర్లు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వైర్ల తొలగింపు ప్రక్రియ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీంతో విద్యుత్ అధికారులు అనుమతులు లేకుండా స్తంభాలపై ఏర్పాటు చేసిన టీవీ, ఇంటర్ నెట్ కేబుళ్లను తొలగిస్తున్నారు.
Hyderabad | సేవలు అందక ఆందోళన
ప్రమాదకరంగా ఉన్న కేబుళ్లను అధికారులు తొలగిస్తున్నారు. అయితే ఒక్కసారిగా వైర్లను కట్ చేస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో టీవీలు రావడం లేదు. ఇంటర్ నెట్ సేవలు (Internet Services) నిలిచిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో పలు చోట్ల ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగినట్లు ఫిర్యాదులు చేస్తున్నారు. నెట్ లేకపోతే చాలా మంది ఇబ్బంది పడతారని, ఇలా ఒక్కసారిగా కేబుళ్లు కట్ చేయడం సరికాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
