అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad Traffic Police | నగరంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆక్రమణలను తొలగించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నగరంలోని కుమార్గల్లీలో (Kumar Gally) దుకాణాల సామగ్రిని రోడ్లపైనే ఉంచారని పేర్కొంటూ ట్రాఫిక్ పోలీసులు దాడులు చేశారు. దుకాణాల బయట రోడ్డుకు ఆనుకుని వేసిన షెడ్లను తొలగించారు. అలాగే సామగ్రిని తరలించారు. దీంతో పలువురు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సమాచారం లేకుండా షెడ్లు తొలగిస్తున్నారని దుకాణదారులు పోలీసులతో వాదించారు.
Nizamabad Traffic Police | పోలీసుల విధులను అడ్డుకున్నారని..
అయితే ఆక్రమణలను తొలగిస్తున్న కొందరు తమ విధులను అడ్డుకున్నారని ఆరోపిస్తూ ట్రాఫిక్ పోలీసులు 2వ టౌన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రోడ్లపై అనధికారికంగా ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా షెడ్లు వేసి సామాగ్రి వేసి ఏర్పాటుచేయగా వాటిని తొలగిస్తుంటే పలువురు పోలీసుల విధులను అడ్డుకున్నారని వారు పేర్కొంటూ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.