అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | పంచాయతీ ఎన్నికల్లో (panchayat elections) భాగంగా విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎల్లారెడ్డి పోలీసులు (Yellareddy police) తెలిపారు. ఈ మేరకు మంగళవారం వివరాలు వెల్లడించారు. మెల్లకుంట తండాలో (Mellakunta Thanda) పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ బూత్ వద్ద ఉప సర్పంచ్ ఎన్నిక సమయంలో వాగ్వాదం జరిగింది.
Yellareddy | పోలీసులపైనే దాడి..
ఈ క్రమంలో మహాదేవుని గడ్డ తండాకు (Mahadevuni Gadda Thanda) చెందిన గ్రామస్థులు పోలీసు విధులను అడ్డంపడి వారితో గొడవకు దిగారు. పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఈనెల14వ తేదీన పోలీసులు ముగ్గురు గ్రామస్థులపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు వారు తెలిపారు.