ePaper
More
    HomeతెలంగాణRamchandra Rao | మతపరమైన రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

    Ramchandra Rao | మతపరమైన రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Ramchandra Rao | బీసీ 42 శాతం రిజర్వేషన్లపై బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ అందులోని పది శాతం మతపరమైన రిజర్వేషన్లకే వ్యతిరేకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. మతపరమైన రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం జరుగుతుందని, దీనికి బీసీలు ఏకమై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం నల్గొండ జిల్లా(Nalgonda District)లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

    నల్గొండ జిల్లా రాజకీయ చైతన్యం కలిగిందని, అయితే ఇక్కడ కూడా కుటుంబ పాలన నడుస్తోందని విమర్శించారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ముందుకు రావాలంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమన్నారు. నల్గొండ జిల్లాలోని యువత, మహిళలు పెద్దఎత్తున బీజేపీలో చేరి, కుటుంబ రాజకీయాలను అంతమొందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

    Ramchandra Rao | అర్హులందరికీ కార్డులివ్వాలి..

    అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇవ్వాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. తన సొంత జిల్లా నల్గొండలో పర్యటిస్తున్న రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కోసం ఇక్కడకు వస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఎంపిక చేస్తున్న లబ్ధిదారులపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయని, రేషన్ కార్డులను (Ration Cards) పార్టీ కార్యకర్తలకే ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతున్నదన్న సమాచారం అందుతోందని చెప్పారు.

    READ ALSO  Suryapeta | రెచ్చిపోయిన దొంగలు.. 18 కిలోల బంగారం చోరీ

    రేషన్ ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ఉచితంగా అందిస్తోందని తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం (State Government) కేంద్రానికే కనీసం కృతజ్ఞత చెప్పకుండా దాన్ని తమ క్రెడిట్​గా చెప్పుకుంటోందని మండిపడ్డారు. గతంలో రేషన్ షాపుల వద్ద ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మలు ఉండేవని, ఇప్పుడు వాటిని తొలగించడం సరికాదన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు.

    Ramchandra Rao | మతపరమైన రిజర్వేషన్లు..

    కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల(BC Reservations) పేరిట 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం మతపరమైన కోటా చేర్చడం సరికాదని రాంచందర్ రావు అన్నారు. సుప్రీం కోర్టు కూడా మతపరమైన రిజర్వేషన్లను నిరాకరించిందని గుర్తు చేశారు.

    READ ALSO  Ration cards | రేషన్ కార్డుల జారీ.. నిరంతర ప్రక్రియ: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

    మతపరమైన రిజర్వేషన్ల వల్ల నిజమైన బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. బీసీ వర్గాలు దీనిపై గమనించి ఉద్యమానికి సిద్ధం కావాలని సూచించారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, దానిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా వారిదేనని స్పష్టం చేశారు. రేవంత్ ప్రభుత్వం కేంద్రాన్ని నిందించడం మానుకొని, ముందుగా తాము ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

    Ramchandra Rao | ప్రాజెక్టులపై స్పష్టత నివ్వాలి

    రాష్ట్రంలోని ప్రాజెక్టుల స్థితిగతులపై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఎందుకు మౌనంగా ఉంటోందని బీజేపీ అధ్యక్షుడు ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆయా ప్రాజెక్టుల పనులు ఎందుకు నిలిచిపోయాయో స్పష్టతనివ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కేంద్రంపై నిందలు వేస్తోందని విమర్శించారు.

    READ ALSO  Pod Taxis | హైదరాబాద్​లో ట్రాఫిక్​ కష్టాలకు చెక్​.. త్వరలో పాడ్​ ట్యాక్సీలు!

    భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామస్థాయి నుంచి జెడ్పీటీసీ స్థాయి వరకు ప్రత్యక్షంగా పోటీ చేస్తుందని తెలిపారు. గతంలో స్థానిక ఎన్నికల్లో (Local Elections) బీజేపీ పెద్దగా పోటీ చేయలేదని, కానీ ఈసారి బలంగా పోటీ చేస్తామని చెప్పారు. విద్యార్థి పరిషత్ నుంచి వచ్చిన కార్యకర్తలుగా మేము ప్రజల సమస్యలపై పోరాడుతున్నామని వివరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనను ప్రజలు చూశారని.. ఇప్పుడు బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని రాం చందర్ రావు ప్రజలను కోరారు. డబుల్ ఇంజిన్ సర్కార్​తో వికసిత తెలంగాణను సాధిస్తామని చెప్పారు.

    Latest articles

    Rajeev Kanakala | వివాదంలో సుమ భ‌ర్త‌.. రాజీవ్‌కి నోటీసులు పంపిన పోలీసులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Rajeev Kanakala | టాలీవుడ్ న‌టుడు, యాంక్ సుమ భ‌ర్త రాజీవ్ కనకాల ఓ...

    Madhya Pradesh | నడిరోడ్డుపై గుర్రాల ఫైటింగ్… క‌ట్‌చేస్తే ఆటోలో ఇరుక్కున్న అశ్వం..వీడియో వైర‌ల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​:Madhya Pradesh | మ‌నుషులే కాదు జంతువులు కూడా కొన్ని సంద‌ర్భాల‌లో భీక‌ర‌మైన ఫైటింగ్ చేస్తుండ‌డం...

    Mopal | కులాస్​పూర్​లో దొంగల బీభత్సం.. పదిళ్లలో చోరీ

    అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​: Mopal | మోపాల్​ మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బుధవారం రాత్రి ఏకంగా పదిళ్లలో...

    Sri Ram Sagar | శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్ట్​కు స్వల్పంగా పెరిగిన ఇన్​ఫ్లో

    అక్షరటుడే, ఆర్మూర్ : Sri Ram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరామ్​ సాగర్​(Sri Ram...

    More like this

    Rajeev Kanakala | వివాదంలో సుమ భ‌ర్త‌.. రాజీవ్‌కి నోటీసులు పంపిన పోలీసులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Rajeev Kanakala | టాలీవుడ్ న‌టుడు, యాంక్ సుమ భ‌ర్త రాజీవ్ కనకాల ఓ...

    Madhya Pradesh | నడిరోడ్డుపై గుర్రాల ఫైటింగ్… క‌ట్‌చేస్తే ఆటోలో ఇరుక్కున్న అశ్వం..వీడియో వైర‌ల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​:Madhya Pradesh | మ‌నుషులే కాదు జంతువులు కూడా కొన్ని సంద‌ర్భాల‌లో భీక‌ర‌మైన ఫైటింగ్ చేస్తుండ‌డం...

    Mopal | కులాస్​పూర్​లో దొంగల బీభత్సం.. పదిళ్లలో చోరీ

    అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​: Mopal | మోపాల్​ మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బుధవారం రాత్రి ఏకంగా పదిళ్లలో...