అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్(Domestic Stock Market) ఐదు వరుస సెషన్ల తర్వాత లాభాల బాట పట్టింది. టెలికాం, ఐటీ సెక్టార్లు మినహా మిగతా అన్ని రంగాలలోనూ కొనుగోళ్ల మద్దతు లభించింది. బుధవారం ఉదయం సెన్సెక్స్ 118 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా అక్కడినుంచి 88 పాయింట్లు కోల్పోయింది.
ఇంట్రాడే కనిష్టాల నుంచి కోలుకుని 732 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ (Nifty) 33 పాయింట్ల లాభంతో ప్రారంభమై 2 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 218 పాయింట్లు పెరిగింది. చివరి అరగంటలో ప్రాఫిట్ బుకింగ్‌తో లాభాలు తగ్గాయి. చివరికి సెన్సెక్స్ 545 పాయింట్ల లాభంతో 85,220 వద్ద, నిఫ్టీ 190 పాయింట్ల లాభంతో 26,129 వద్ద స్థిరపడ్డాయి.
మార్కెట్ పెరగడానికి కారణాలు..
మార్కెట్ అస్థిరతను సూచించే ఇండియా విక్స్ మరింత తగ్గి 9.37 వద్ద నిలిచింది. ఇది మదుపరులలో భయరహిత పరిస్థితిని సూచిస్తోంది.
ఐదు వరుస సెషన్ల పాటు మార్కెట్లు నష్టాలను చూశాయి. దీంతో చాలా స్టాక్స్ అట్రాక్టివ్ జోన్లో కనిపించడంతో వాల్యూ బయ్యింగ్ కనిపించింది. ప్రధానంగా మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ రాణించాయి.
ఎంపిక చేసిన ఉక్కు దిగుమతులపై ప్రభుత్వం మూడేళ్ల రక్షణాత్మక సుంకాన్ని విధించిన తర్వాత మెటల్ సెక్టార్ దూసుకుపోయింది.
రిలయన్స్, కొటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు ప్రధాన సూచీలలో ర్యాలీకి కారణమయ్యాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,799 కంపెనీలు లాభపడగా 1,413 స్టాక్స్ నష్టపోయాయి. 162 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 126 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 145 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 11 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
టెలికాం, ఐటీ సెక్టార్లు మినహా..
బీఎస్ఈలో టెలికాం, ఐటీ సెక్టార్లు మినహా మిగిలిన అన్ని ప్రధాన రంగాల షేర్లు రాణించాయి. టెలికాం ఇండెక్స్ 0.74 శాతం, ఐటీ ఇండెక్స్ 0.11 శాతం నష్టపోయాయి. ఆయిల్ అండ్ గ్యాస్ 2.73 శాతం, ఎనర్జీ 2.28 శాతం, మెటల్ ఇండెక్స్ 1.51 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 1.39 శాతం, పీఎస్‌యూ 1.45 శాతం, యుటిలిటీ 1.25 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 1.22 శాతం, క్యాపిటల్ మార్కెట్ 1.20 శాతం, ఇన్ఫ్రా 1.19 శాతం, పవర్ 1.12 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.12 శాతం లాభపడ్డాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.19 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.01 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.75 శాతం లాభంతో ముగిశాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 25 కంపెనీలు లాభపడగా.. 5 కంపెనీలు నష్టపోయాయి. టాటా స్టీల్ 2.45 శాతం, కొటక్ బ్యాంక్ 2.17 శాతం, రిలయన్స్ 1.86 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.82 శాతం, టైటాన్ 1.81 శాతం పెరిగాయి.
Losers : టీసీఎస్ 1.29 శాతం, టెక్ మహీంద్రా 0.86 శాతం, ఇన్ఫోసిస్ 0.49 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.27 శాతం, సన్‌ఫార్మా 0.02 శాతం నష్టపోయాయి.