అక్షరటుడే, ఆర్మూర్: CMRF | సీఎంఆర్ఎఫ్ చెక్కులతో బాధితులకు ఎంతో ఉపశమనం లభిస్తుందని ఆలూర్ మండల కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. గుత్ప గ్రామానికి (Guthpa village) చెందిన పలువురికి బుధవారం చెక్కులను అందజేశారు.
ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినయ్‌కుమార్ రెడ్డి (In-charge Vinay Kumar Reddy) చొరవతో మండలానికి చెందిన ప్రదీప్‌కు రూ.60వేలు, గంగాధర్‌కు రూ.29,500, వసంత్‌కు రూ.24,000, రూ.పోశెట్టి రూ.23,000 పోసానికి రూ.27,000, అమృత రూ.9వేలు, సౌజన్యకు రూ.9వేలు చెక్కులు మంజూరు అయ్యాయి. వారి కుటుంబ సభ్యులకు నాయకులు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బాశెట్టి శశికుమార్, పార్టీ నాయకులు అశోక్, నవీన్, సతీష్, నరేష్, నితిన్, నవీన్, స్వామి, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.