Homeజిల్లాలునిజామాబాద్​Thalassemia Center | తలసేమియా బాధితులకు ఊరట.. ఇక నుంచి ఐదు రోజులు రెడ్​క్రాస్​ సెంటర్​...

Thalassemia Center | తలసేమియా బాధితులకు ఊరట.. ఇక నుంచి ఐదు రోజులు రెడ్​క్రాస్​ సెంటర్​ సేవలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thalassemia Center | రెడ్​క్రాస్​ సంస్థ(Red Cross Organization) తలసేమియా బాధితులకు ఊరట కలిగించే వార్త చెప్పింది. నిజామాబాద్(Nizamabad)​ నగరంలోని తలసేమియా రక్త మార్పిడి కేంద్రం ఇక నుంచి వారానికి ఐదు రోజులు సేవలు అందిస్తోందని తెలిపింది.

నగరంలోని తలసేమియా కేంద్రం(Thalassemia Center) గతంలో వారానికి మూడు రోజులు మాత్రమే పని చేసేది. అయితే కేంద్రానికి చిన్నారుల సంఖ్య పెరగడంతో వారానికి ఐదు రోజులు సేవలు అందించాలని నిర్ణయించినట్లు రెడ్​ క్రాస్​ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

సోమవారం నుంచి శుక్రవారం వరకు (ప్రభుత్వ సెలవులు మినహా) కొనసాగుతుందని రెడ్ క్రాస్ జిల్లా ఛైర్మన్ బుస్స ఆంజనేయులు తెలిపారు. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. రక్తం కోసం ఒక రోజు ముందుగా బుకింగ్ చేసుకోవాలని కోరారు. ఇతర వివరాల కోసం 08462-222002, 08462-314236 నంబర్లలో సంప్రదించాలన్నారు.