అక్షరటుడే, వెబ్‌డెస్క్ : High Court | సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని న్యాయస్థానం ఆదేశించింది.
ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరిపిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తనపై చర్యలు చేపట్టవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని స్మిత దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram Project) జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ జరిపి ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక అమలును నిలిపివేయాలంటూ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ (Smitha Sabarwal) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తనను సాక్షిగా పిలిచిందని, అయితే తనపై ఆరోపణలు చేసే ముందు చట్టప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. విచారణ కమిషన్ చట్టం-1952లోని 8బీ, 8సీ సెక్షన్ల ప్రకారం నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలన్న నిబంధనలను కమిషన్ అమలు చేయలేదని పేర్కొన్నారు.
High Court | ఊరట కల్పించిన కోర్టు..
స్మితా సబర్వాల్ తరఫున సీనియర్ న్యాయవాది, మాజీ అడ్వకేట్ జనరల్ రాంచందర్‌రావు వాదనలు వినిపించారు. గతంలో సీఎంవో కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ కాళేశ్వరం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని ఘోష్ కమిషన్ (Ghosh Commission) పేర్కొంది తప్ప.. ఆమె అవకతకవకలకు పాల్పడినట్లు చెప్పలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నేపథ్యంలో న్యాయస్థానం ఆమెకు ఊరట కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఘోష్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. గతంలో ఇలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ హరీశ్‌రావు, మాజీ సీఎస్ ఎస్కే జోషి కూడా హైకోర్టును ఆశ్రయించగా, వారిపై తదుపరి చర్యలు చేపట్టవద్దని న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్మితా సబర్వాల్‌కు కూడా ఊరట కల్పించిన కోర్టు (High Court).. వారి పిటిషన్లతో పాటే ఆమె పిటిషన్‌ను కూడా విచారిస్తామని పేర్కొంటూ తదుపరి దర్యాప్తును వాయిదా వేసింది.
1 comment
[…] పునశ్చైతన్య సేవా సంస్థ హైకోర్టులో (High Court) పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ […]
Comments are closed.