ePaper
More
    HomeజాతీయంPhone Tapping Case | ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్​రావుకు ఊరట

    Phone Tapping Case | ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్​రావుకు ఊరట

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Phone Tapping Case | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసులో మాజీ ఐపీఎస్​ ప్రభాకర్​రావు(Former IPS Prabhakar Rao)కు ఊరట లభించింది.

    అప్పటి ఎస్​ఐబీ చీఫ్​గా ఉన్న ప్రభాకర్​రావుపై గతేడాది మార్చిలో ఫోన్​ ట్యాపింగ్​ కేసు నమోదైన విషయం తెలిసిందే. పలువురు రాజకీయ నాయకులతో పాటు, జడ్జీలు, సినీ ప్రముఖులు, వ్యాపారస్తులు ఫోన్లు ట్యాప్​ చేసినట్లు ఆయనపై పంజాగుట్ట పోలీస్​ స్టేషన్​(Panjagutta Police Station)లో కేసు నమోదు అయింది.

    ప్రభాకర్​ రావు తనపై కేసు నమోదైన మరుసటి రోజే అమెరికా (America) వెళ్లిపోయారు. ఎన్నిసార్లు నోటీసులు పంపినా స్పందించలేదు. మరోవైపు ముందస్తు బెయిల్​ కోసం కోర్టులను ఆశ్రయించిన అక్కడ చుక్కెదురైంది. ఈ క్రమంలో ఇటీవల తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ ఆయన అమెరికా ప్రభుత్వాన్ని (US government) కోరాడు. అయితే ఫోన్​ ట్యాపింగ్​ కేసు విచారిస్తున్న సిట్​ ఆయనను శరణార్థిగా గుర్తించకుండా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అమెరికాకు పంపింది. దీంతో భారత ప్రభుత్వం జారీ చేసిన రెడ్​ కార్నర్​ నోటీసుల మేరకు ఆయనను ఇండియా పంపడానికి సిద్ధం అవుతోంది.

    Phone Tapping Case | తానే వస్తానని..

    అమెరికా తనను ఇండియా పంపడానికి సిద్ధం కావడంతో ప్రభాకర్​రావు తానే ఇండియాకు రావాలని యత్నిస్తున్నారు. అయితే పోలీసులు గతంలో ఆయన పాస్​పోర్టును బ్లాక్ (Passport Block)​ చేశారు. దీంతో ప్రభాకర్​ రావు సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించగా.. పాస్‌పోర్ట్‌ ఇవ్వాలని ఆదేశించింది.

    కాగా.. పాస్‌ పోర్ట్ వచ్చిన మూడు రోజుల్లో ఇండియాకు రావాలని కోర్టు ఆయనకు తెలిపింది. తదుపరి విచారణ వరకు ప్రభాకర్‌రావును అరెస్ట్‌ చేయొద్దని పోలీసులకు సూచించింది. విచారణను ఆగస్ట్‌ 5కి వాయిదా వేసింది. కాగా జూన్​ 20న విచారణకు హాజరు కావాలని ప్రభాకర్​ రావును నాంపల్లి కోర్టు(Nampally Court) ఆదేశించిన విషయం తెలిసిందే.

    More like this

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...

    Nizamabad | విపత్తు సమయాల్లో సమర్థవంతంగా సేవలందించాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | ప్రకృతి విపత్తు సంభవించిన సమయంలో తక్షణసాయం అందించేలా ఆపదమిత్రలు సిద్ధంగా ఉండాలని అదనపు...