HomeUncategorizedUS Visa | అమెరికాలోని భారతీయ విద్యార్థులకు ఊరట.. వీసాల రద్దుకు బ్రేక్

US Visa | అమెరికాలోని భారతీయ విద్యార్థులకు ఊరట.. వీసాల రద్దుకు బ్రేక్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : US Visa | అమెరికా Americaలోని భారతీయ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. అమెరికా అధ్యక్షుడు US President ట్రంప్ Trump​ ఇటీవల కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలువురు విదేశీ విద్యార్థుల వీసాలను కూడా ట్రంప్​ ప్రభుత్వం రద్దు చేసింది.

అంతేగాకుండా స్టూడెంట్‌ ఎక్స్‌ఛేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(SEVIS)ను క్యాన్సిల్​ చేసింది. ఇందులో అధిక శాతం భారతీయ విద్యార్థులే ఉన్నారు. దీంతో పలువురు విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ట్రంప్‌ కార్యవర్గం రద్దు చేసిన 133 మంది విద్యార్థుల స్టూడెంట్‌ ఎక్స్‌ఛేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ను కోర్టు court రద్దు చేసింది. వీసాల రద్దు నిర్ణయాన్ని ఆపాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. అయితే ఈ విద్యార్థులు లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీల దృష్టిలో పడటంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కాగా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టిన కోర్టు విద్యార్థుల వీసాలను పునరుద్ధరించింది. అయితే ట్రాఫిక్​ నిబంధనల ఉల్లంఘన వంటి చిన్న కారణాలతో సైతం విద్యార్థుల వీసాలు రద్దు చేస్తున్నారని వారి తరఫు లాయర్లు వాదించారు.