ePaper
More
    HomeతెలంగాణHarish Rao | హైకోర్టులో హరీశ్​రావుకు ఊరట

    Harish Rao | హైకోర్టులో హరీశ్​రావుకు ఊరట

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావుకు హైకోర్టు(High Court)లో ఊరట లభించింది. హరీశ్​రావు ఎన్నిక చెల్లదంటూ సిద్దిపేట ఎమ్మెల్యే బీఎస్పీ తరఫున పోటీచేసిన చక్రధర్​గౌడ్​(Siddipet MLA Chakradhar Goud) వేసిన పిటిషన్​ను​ కోర్టు కొట్టివేసింది. ఎన్నికల సమయంలో హరీశ్​రావు సరైన వివరాలు వెల్లడించలేదని చక్రధర్​గౌడ్​ పిటిషన్​ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై మంగళవారం న్యాయస్థానం విచారణ జరిపింది. హరీశ్​రావు తరఫున మాజీ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ రాంచందర్‌రావు వాదనలు వినిపించారు. అనంతరం చక్రధర్​గౌడ్​ పిటిషన్​ను న్యాయస్థానం కొట్టి వేసింది.

    Harish Rao | గతంలో ఫోన్​ ట్యాపింగ్​ కేసు

    రియల్​ ఎస్టేట్​ వ్యాపారి చక్రధర్​గౌడ్​ ఫార్మర్స్​ ఫస్ట్​ ఫౌండేషన్​ పేరిట రైతులకు చేయూత అందిస్తూ ఉంటారు. సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసం ఆయన బీఆర్​ఎస్(BRS)​ హయాంలో హరీశ్​రావుపై అనేక విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆయనను బీఆర్​ఎస్​ ప్రభుత్వం చీటింగ్​ కేసు(Cheating case)లో అరెస్ట్​ చేసి జైలుకు పంపింది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో చక్రధర్​ గౌడ్​ బీఎస్పీ నుంచి సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు.

    కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో చక్రధర్​గౌడ్​ హస్తం గూటికి చేరారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీశ్​రావుపై గతంలో ఆయన ఫోన్​ ట్యాపింగ్​ కేసు(Phone tapping case) పెట్టారు. తన ఫోన్​ను హరీశ్​ట్యాప్​ చేయించారని ఆరోపిస్తూ పంజాగుట్ట పోలీస్​ స్టేషన్​(Punjagutta Police Station)లో కేసు పెట్టగా.. హైకోర్టు కోట్టి వేసింది. తాజాగా ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్​ సైతం న్యాయస్థానం తోసిపుచ్చడం గమనార్హం.

    More like this

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...

    IPO | ఐపీవోకు మంగళ సూత్రాల తయారీ కంపెనీ.. నేడు సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | మంగళసూత్రాలు తయారు చేసే శ్రింగార్‌ హౌస్‌ ఆఫ్‌ మంగళసూత్ర ఐపీవోకు వచ్చింది....

    Terrorists Arrest | ఐసిస్ ఉగ్ర‌వాదుల‌ అరెస్టు.. రాంచీ, ఢిల్లీలో ప‌ట్టుబ‌డిన నిందితులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terrorists Arrest | ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ర్య‌ల్లో భ‌ద్ర‌తా ద‌ళాలు కీల‌క విజ‌యం సాధించాయి....