అక్షరటుడే, వెబ్‌డెస్క్: Group-1 Rankers | గ్రూప్–1 ర్యాంకర్లకు హైకోర్టు (High Court)లో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. దీంతో నియామక పత్రాలు పొందిన వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రూప్ -1 నియామకాలపై సింగిల్ జడ్జి తీర్పును ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం రద్దు చేసింది. గ్రూప్ – 1 ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో ఏకసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై గతంలో కోర్టు స్టే ఇవ్వగా.. తాజాగా తీర్పును కొట్టి వేసింది. గ్రూప్-1 నియామకాలు సక్రమమేనన్న పేర్కొంది. గ్రూప్-1 పరీక్ష (Group-1 Exam) పారదర్శకంగానే జరిగిందని తెలిపింది. పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
Group-1 Rankers | ఏం జరిగిందంటే?
రాష్ట్ర ప్రభుత్వం (State Government) నిర్వహించిన గ్రూప్–1 పరీక్షపై పలువురు అభ్యర్థులు గతంలో కోర్టును ఆశ్రయించారు. జవాబు పత్రాల మూల్యాంకనం సక్రమంగా జరగలేదని వారు పేర్కొన్నారు. ఈ మేరకు ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ర్యాంకులను రద్దు చేసింది. మళ్లీ పరీక్షలు పెట్టాలని ఆదేశించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై టీజీపీఎస్సీ (TGPSC)తో పాటు ర్యాంకర్లు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు సేకరించిన కోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది.
Group-1 Rankers | నియామకాలు పూర్తి
సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై ద్విసభ్య ధర్మాసనం స్టే ఇవ్వడంతో ప్రభుత్వం అప్పుడే హడావుడిగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందించింది. అయితే కోర్టు తన ఉత్తర్వుల్లో తుది తీర్పునకు లోబడి నియామకాలు ఉండాలని స్పష్టం చేసింది. దీంతో కొలువులు సాధించిన అభ్యర్థులు తీర్పు కోసం ఉత్కంఠతో ఎదురు చూశారు. ఈ పిటిషన్‌పై విచారణ గతంలోనే ముగిసింది. జనవరి 22న తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే తీర్పు రెడీ కాలేదని కోర్టు ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు గురువారం ఉదయం తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు కొట్టి వేయడంతో ఉద్యోగాలు పొందిన 563 మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Group-1 Rankers | తొలిసారి పరీక్షలు
తెలంగాణ (Telangana) ఏర్పాటు అయిన తర్వాత తొలిసారి గ్రూప్–1 పరీక్షలు జరిగాయి. 2024 జూన్‌లో పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఫలితాలు ప్రకటించి మెయిన్స్ కోసం అభ్యర్థులను ఎంపిక చేశారు. మెయిన్స్ పరీక్షలు 2024 అక్టోబరు 21 నుంచి 27 వరకు జరిగాయి. 2025 మార్చి 10న వీటి ఫలితాలు విడుదలయ్యాయి. అయితే కొందరు అభ్యర్థులు మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని కోర్టును ఆశ్రయించారు. దీంతో సింగిల్ బెంచ్ పరీక్షలను రద్దు చేయగా.. డివిజన్ బెంచ్ ఆ తీర్పును కొట్టి వేసింది.