HomeతెలంగాణOMC Case | గాలి జనార్దన్‌రెడ్డికి ఊరట.. బెయిల్​ మంజూరు చేసిన హైకోర్టు

OMC Case | గాలి జనార్దన్‌రెడ్డికి ఊరట.. బెయిల్​ మంజూరు చేసిన హైకోర్టు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :OMC Case | అక్రమ మైనింగ్​ కేసు(Illegal mining case)లో గాలి జనార్దన్​రెడ్డికి హైకోర్టు(High Court)లో ఊరట లభించింది. ఓబులాపురం అక్రమ మైనింగ్‌‌‌‌ కేసు(ఓఎంసీ)లో కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్​రెడ్డికి సీబీఐ కోర్టు(CBI Court) జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

బుధవారం ఆయనకు బెయిల్​ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆయన దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. పాస్​పోర్ట్​ సరెండర్ చేయడంతో పాటు రూ.10 లక్షల చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.అక్రమ మైనింగ్‌‌‌‌ కేసులో జనార్దన్​రెడ్డికి సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షను సస్పెండ్‌‌‌‌ చేయాలంటూ ఆయన హైకోర్టులో మధ్యంతర పిటిషన్‌‌‌‌ వేశారు.

దీనిపై హైకోర్టులో మంగళవారం వాదనలు పూర్తయ్యాయి. బుధవారం న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన పీఏ అలీఖాన్, బీవీ శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్​కు హైకోర్టు బెయిల్​ మంజూరు చేసింది. ఈ నలుగురికి నాంపల్లి సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను సస్పెండ్​ చేసింది.