ePaper
More
    HomeతెలంగాణFormer MLA Jeevan Reddy | సుప్రీంలో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ఊరట

    Former MLA Jeevan Reddy | సుప్రీంలో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ఊరట

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Former MLA Jeevan Reddy | బీఆర్​ఎస్(BRS)​ నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్​ మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి(Former MLA from Armur Jeevan Reddy)కి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తన భూమిని ఆక్రమించి బెదిరించారంటూ జీవన్​రెడ్డిపై సామ దామోదర్‌రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2016లో తన భూమిని తీసుకుని అభివృద్ధి చేస్తానంటూ ఒప్పందం కుదుర్చుకున్న జీవన్​రెడ్డి.. అభివృద్ధి చేయలేదని, డబ్బులు కూడా ఇవ్వలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాకుండా తన భూమిలోకి వెళ్లనివ్వడం లేదన్నారు. దీంతో జీవన్​రెడ్డిపై చేవెళ్ల పోలీసులు(Police) కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనతో పాటు, కుటుంబ సభ్యులను అరెస్ట్​ చేయకుండా ముందస్తు బెయిల్​ ఇవ్వాలని సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. ఈ పిటిషన్​ను బుధవారం విచారించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్​ మంజూరు చేసింది. కేసులో పోలీసులకు సహకరించాలని ఆదేశించింది.

    More like this

    Banswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam...

    Nepal | 11 ఏళ్ల బాలిక వ‌ల్ల నేపాల్ ప్ర‌భుత్వం కూలిందా.. ఉద్యమం ఉద్రిక్త‌త‌కి దారి తీయడానికి కార‌ణం ఇదే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌లో జెన్‌ జెడ్‌ యువత ప్రారంభించిన ఉద్యమం ఊహించని రీతిలో ఉద్రిక్తతకు...

    Nara Lokesh | నేపాల్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్నిర‌ద్దు చేసుకున్న నారా లోకేష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | నేపాల్‌(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని...