అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Reliance | దేశంలోని ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మార్కెట్‌లో అనేక మార్పులు చేర్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే జియో ద్వారా టెలికాం రంగంలో, కాంపా కోలా ద్వారా కూల్‌డ్రింక్ మార్కెట్‌లో విప్లవం తెచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఇప్పుడు బాటిల్ వాటర్ రంగంలోకి అడుగుపెడుతోంది.
భారీ ప్రతిష్టాత్మకంగా ఈ రంగంలోకి దిగిన రిలయన్స్ (Reliance), తన కొత్త బ్రాండ్‌లు “కాంపా ష్యూర్, ఇండిపెండెన్స్ వాటర్‌లతో (Independence Water) ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రస్తుతం బిస్లరీ, కిన్లీ, ఆక్వాఫినా వంటి బ్రాండ్లు ఆధిపత్యం వహిస్తున్న ఈ మార్కెట్‌లో రిలయన్స్ తక్కువ ధరలకు అందించేందుకు సిద్ధమైంది. మార్కెట్‌లో ఉన్న ధరలతో పోల్చితే 20% నుంచి 43% వరకు తక్కువగా కొత్త ధరలను నిర్ణయించింది.
Reliance | ధరల తేడా ఇలా ఉండొచ్చు:
250ml వాటర్ బాటిల్ – రూ.5 ( బిస్లెరీ – రూ.7), 500ml వాటర్ బాటిల్ – రూ.10 (కిన్లీ – రూ.13), 1 లీటర్ కాంపా ష్యూర్ బాటిల్: రూ. 15 (బిస్లరీ, ఆక్వాఫినా, కిన్లీలకు రూ. 20), 2 లీటర్ కాంపా ష్యూర్ ప్యాక్: రూ. 25 (ప్రత్యర్థులకు రూ. 30–35), 1.5 లీటర్ ఇండిపెండెన్స్ బాటిల్: రూ. 20 (ప్రత్యర్థులకు రూ. 30–35)గా ఉండనున్నాయి. సెప్టెంబర్‌లోనే “కాంపా ష్యూర్” లాంచ్ అయినా, అక్టోబర్ కల్లా ఇది దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి రానుంది. తక్కువ ధర, నాణ్యత కలిసిన ఉత్పత్తులే ఈ బ్రాండ్ USPగా Reliance Style లో నిలవనుంది.
ప్రస్తుతం రూ. 20,000 కోట్ల విలువైన బాటిల్ వాటర్ మార్కెట్, ప్రతి ఏడాది వేగంగా పెరుగుతోంది. జనాభా పెరగడం, నీటి కొరత, ప్రయాణాలు ఎక్కువగా చేయడం వంటివి దీనికి కారణాలు. గత 5 ఏళ్లలో ఈ మార్కెట్ 40–45% వరకు పెరిగింది. ఇప్పటికే బిస్లెరి 36% మార్కెట్ షేర్‌తో టాప్‌లో ఉంది. కానీ, రిలయన్స్ తక్కువ ధరల వ్యూహం వల్ల అన్ని బ్రాండ్ల మార్కెట్ వాటాలు బాగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. బీసీ స్థాయిలో ఉత్పత్తి కేంద్రాలు, పంపిణీ వ్యవస్థ (డిస్ట్రిబ్యూషన్) ఏర్పాటు చేయడం రిలయన్స్‌కి ఒక చాలెంజ్. కానీ జియో, కాంపా కోలా విజయాల పరంపర చూసిన తర్వాత, రిలయన్స్ ఈ రంగంలో కూడా దూసుకుపోవడంలో సందేహమే లేదు అని విశ్లేషకులు భావిస్తున్నారు.