Homeబిజినెస్​Jio Anniversary | జియో 9వ వార్షికోత్సవం సందర్భంగా బంపర్ ఆఫర్లు.. 50 కోట్ల యూజర్లకు...

Jio Anniversary | జియో 9వ వార్షికోత్సవం సందర్భంగా బంపర్ ఆఫర్లు.. 50 కోట్ల యూజర్లకు వినూత్న గిఫ్ట్‌లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Jio Anniversary | దేశంలో అగ్రగామిగా ఉన్న టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన 9వ వార్షికోత్సవం (సెప్టెంబర్ 5) సందర్భంగా వినియోగదారుల కోసం భారీ ఆఫర్లను ప్రకటించింది.

దేశవ్యాప్తంగా 50 కోట్ల యూజర్ల‌ని సంపాదించుకున్న క్ర‌మంలో, ఈ మైలురాయిని సెలబ్రేట్ చేస్తూ జియో అనేక బెనిఫిట్లు తీసుకొచ్చింది.సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 5 వరకు, రూ.349 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లను వినియోగిస్తున్న ప్రీపెయిడ్ (Prepaid) మరియు పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు(Postpaid Customers), అపరిమిత 5జీ డేటా ఉచితంగా అందించనుంది. ఇది జియో ట్రూ 5జీ సర్వీసు ఉన్న అన్ని ప్రాంతాల్లో వర్తించనుంది.

Jio Anniversary | భ‌లే ఆఫ‌ర్స్..

వార్షికోత్సవ వీకెండ్ ఆఫర్ (Anniversary Weekend Offer) సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు ప్ర‌క‌టించారు. మూడు రోజుల ప్రత్యేక వీకెండ్ ఆఫర్ కింద 5జీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ప్రస్తుత ప్లాన్‌తో సంబంధం లేకుండా అపరిమిత 5జీ డేటా ఉచితం. 4జీ యూజర్లకు కేవలం రూ.39తో ప్రత్యేక రీఛార్జ్ చేసుకుని, రోజుకు గరిష్ఠంగా 3జీబీ 4జీ డేటా పొందవచ్చు. హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవల కోసం జియో హోం కనెక్టివిటీ సేవలను జియో రెండు నెలల పాటు ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. ఫైబర్ ఇంటర్నెట్, ఎంటర్‌టైన్‌మెంట్, స్మార్ట్ హోం ఫీచర్లు (Smart Home Features) మొదలైన సేవలు దీనిలో భాగంగా అందుబాటులో ఉంటాయి.

రూ.349 ప్లాన్‌ను వరుసగా 12 నెలలు రీఛార్జ్ చేసిన వినియోగదారులకు అదనంగా ఒక నెల ఉచిత సేవలు జియో అందించనుంది. దీని వల్ల యూజర్లకు సంవత్సరం మొత్తం సేవలపై ఎక్కువ విలువ లభిస్తుంది. జియో 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఛైర్మన్ ఆకాశ్ అంబానీ (Chairman Aakash Ambani) మాట్లాడుతూ .. దేశవ్యాప్తంగా 50 కోట్ల వినియోగదారుల విశ్వాసం మాకెంతో గర్వకారణం. జియో ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైందనేది ఈ మైలురాయి ద్వారా స్పష్టమవుతోంది. ప్రతి యూజర్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం” అని అన్నారు. ఏడాది పాటు రూ.349 ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే 13వ నెల కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఇవన్నీ జియో వినియోగదారులకు ఓ ఉత్సవంగా మారేలా ఉన్నాయి. డేటా అవసరాలకు స్మార్ట్ సొల్యూషన్ కావాలనుకుంటే, ఈ ఆఫర్లు మిస్ అవ్వకండి.

Must Read
Related News