అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Reliance Industries | దేశీయ పారిశ్రామిక దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) అనుబంధ రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(Reliance Consumer Products Ltd) భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.
ఆహార పరిశ్రమ రంగంలో దేశవ్యాప్తంగా రూ. 40 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఈ విషయమై గురువారం వరల్డ్ ఫుడ్ ఇండియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం(MoU) కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు(Kurnool) జిల్లాలోనూ రూ. 1,500 కోట్లతో ఓ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది.
రిలయన్స్ సంస్థ వేగంగా విస్తరిస్తున్న కన్జూమర్ ప్రొడక్ట్స్(Consumer Products) రంగంపైనా దృష్టి సారించింది. కన్జూమర్ వ్యాపార విభాగంలో తనదైన ముద్ర వేసేందుకు దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే కాంపా(Campa), ఇండిపెండెన్స్ పేరుతో కార్బొనేటెడ్ సాఫ్ట్డ్రిరక్స్, ప్యాకేజ్డ్ డ్రిరకింగ్ వాటర్‌ను అందిస్తోంది. ఇతర కన్జూమర్ ప్రొడక్టులను తీసుకొచ్చేందుకు ఇతర బ్రాండ్లనూ కొనుగోలు చేస్తోంది. దేశంలోనే అతిపెద్ద ఎఫ్ఎంసీజీ (FMCG) కంపెనీగా అవతరించడంతో పాటు విదేశాలకూ విస్తరించాలనుకుంటోంది. గతనెలలో నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం(AGM)లో రిలయన్స్ చైర్మన్ అంబానీ(Ambani) ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్‌ల విషయమై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఫుడ్ పార్క్‌ల కోసం రూ. 40 వేల కోట్లు వెచ్చించనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఏఐ ఆధారిత ఆటోమేషన్, రోబోటిక్స్, ఆధునిక టెక్నాలజీలతో ఆసియాలోనే అతిపెద్ద ఫుడ్ పార్క్‌కు తెరతీయనున్నట్లు తెలిపారు. రిలయన్స్ కన్జూమర్ ప్రారంభించిన మూడేళ్లలోనే రూ. 11 వేల కోట్ల టర్నోవర్‌ను సాధించినట్లు ఏజీఎంలో పేర్కొన్నారు. అనంతరం మహారాష్ట్రలోని నాగపూర్‌లో రూ. 1,500 కోట్లతో ఆహారోత్పత్తులు, పానీయాల తయారీకి సంబంధించి ఏకీకృత ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ కన్జూమర్ ఆ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని సైతం చేసుకుంది. 2026లో తయారీ కార్యకలాపాలు ప్రారంభమయ్యే ఈ యూనిట్ ద్వారా 500 మందికిపైగా ఉపాధి పొందనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్లోనూ ఇదే తరహా ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. తమిళనాడులో రూ. 1,156 పెట్టుబడితో ఇంటిగ్రేడెట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు.
1 comment
[…] Panchmukhi Hanuman ఆలయం నుంచి రిలయన్స్ మార్ట్ Reliance Mart శ్రీనగర్ కాలనీ మీదుగా ఎల్లమ్మ […]
Comments are closed.