అక్షరటుడే, వెబ్‌డెస్క్: Reliance Industries | ముఖేష్ అంబానీ (Mukesh Ambani) షేరుకు టైమొచ్చింది. గత మూడు నాలుగేళ్లుగా ఇన్వెస్టర్ల సహనాన్ని పరీక్షిస్తూ వస్తున్న రిలయన్స్ (Reliance) షేరు జూలు విదిలించింది. సోమవారం ఇంట్రాడేలో ఏకంగా 4 శాతం వరకు పెరిగింది.
భారత స్టాక్ మార్కెట్ మూడు వారాలుగా లాభాల బాటలో పయనిస్తోంది. దీంతో బెంచ్‌మార్క్ సూచీలు (Benchmark indices) 52 వారాల గరిష్టాన్ని తాకి ఆల్‌టైం హైకి చేరువయ్యాయి. దేశీయ స్టాక్ మార్కెట్‌లో మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) షేర్లు మాత్రం ఇన్నాళ్లూ ఇన్వెస్టర్ల సహనాన్ని పరీక్షిస్తూ వచ్చాయి. 2021 అక్టోబర్‌లో ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 1,238 ఉంది. ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టినవారికి పెద్దగా లాభాలు రాలేదు. ప్రధానంగా దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు చెప్పుకోదగ్గ లాభాలు రాలేదు. కానీ గత శుక్రవారం వెల్లడైన కంపెనీ రెండో త్రైమాసిక ఫలితాలు బాగుండడంతో ఈ రోజు మార్కెట్‌లో రిలయన్స్ షేర్లు పరుగులు తీశాయి. గత సెషన్(Last session)లో రూ. 1,416.80 వద్ద ముగిసిన రిలయన్స్ షేరు ధర సోమవారం సెషన్ ప్రారంభంలోనే దాదాపు 2 శాతం లాభంతో రూ. 1440 వద్ద మొదలైంది. రూ. 1,473.80 వద్ద ఇంట్రాడే(Inrtaday) గరిష్టాన్ని తాకిన షేరు ధర.. చివరికి రూ. 1,466.80 వద్ద స్థిరపడిరది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఒక్కరోజులో ఈ స్థాయిలో పెరగడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం.
Reliance Industries | క్యూ2 ఫలితాలతో జోష్..
రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండో త్రైమాసిక ఫలితాలు గత శుక్రవారం మార్కెట్ ముగిశాక వెల్లడయ్యాయి. ఈసారి అంచనాలకు మించి ఫలితాలు సాధించింది. క్యూ2లో కంపెనీ నికర లాభం(Net profit) రూ. 18,165 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే సుమారు 10 శాతం వరకు లాభం పెరిగింది. ఫలితాలు అంచనాలకు మించి రావడంతో ఇన్వెస్టర్లు రిలయన్స్ స్టాక్‌పై ఆసక్తి చూపారు.