9
అక్షరటుడే, బాన్సువాడ: Fisheries Department | మండలంలోని ఇబ్రహీంపేట్ ఊర చెరువులో (Ibrahimpet village pond) మంగళవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపపిల్లల విత్తనాలను విడుదల చేశారు. మత్స్యశాఖ అధికారి డోలీసింగ్ (Fisheries Officer Dolisingh) ఆధ్వర్యంలో మొత్తం 3.58 లక్షల చేపపిల్లలను వదిలారు.
ఈ సందర్భంగా డీలిసింగ్ మాట్లాడుతూ.. చెరువులలో చేపల ఉత్పత్తి (fish production) పెంపుతో గ్రామీణ మత్స్యకారుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధ్యక్షుడు గాదె సత్యం, ఉపాధ్యక్షుడు పసుపుల సాయిలు, గ్రామ బోయి సంఘం అధ్యక్షుడు రమేష్, కార్యదర్శి సాయిలు, దేవారం నారాయణరెడ్డి, హనుమాన్లు, దేవారం సాయిరెడ్డి, బోయి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.