Homeజిల్లాలునిజామాబాద్​Ankapoor | అంకాపూర్ ప్రజల రిలే నిరాహార దీక్ష తాత్కాలికంగా విరమణ

Ankapoor | అంకాపూర్ ప్రజల రిలే నిరాహార దీక్ష తాత్కాలికంగా విరమణ

డబుల్​ బెడ్​రూం ఇళ్ల కోసం అంకాపూర్​ వాసులు ఆర్మూర్​ పట్టణంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలను తాత్కాలికంగా విరమించారు. ఈ మేరకు ఆర్మూర్​లో సీపీఐఎంఎల్​ మాస్​లైన్​ ప్రతినిధులు మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Ankapoor | అంకాపూర్​లో అర్హులకు డబుల్​ బెడ్​రూం ఇళ్లు (double bedroom houses) కేటాయించాలని కోరుతూ పట్టణంలోని తహశీల్దార్​ కార్యాలయం ఎదుట నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న రిలే దీక్షలను తాత్కాలికంగా విరమించారు. సీపీఐ ఎంఎల్ మాస్​లైన్ పార్టీ ఆధ్వర్యంలో నాలుగురోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం దీక్షా శిబిరం నుంచి ఆర్మూర్ (Armoor) అంబేడ్కర్​ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ మాస్​లైన్ పార్టీ నిజామాబాద్, కామారెడ్డి సంయుక్త జిల్లాల కార్యదర్శి వి.ప్రభాకర్, డివిజన్ కార్యదర్శి బి.దేవారం మాట్లాడుతూ.. తాత్కాలికంగా దీక్ష విరమించినట్లు తెలిపారు. రేపటి నుంచి కలెక్టర్, మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయం వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో సబ్ డివిజన్ కార్యదర్శి బి.కిషన్, పార్టీ జిల్లా నాయకురాలు సత్యక్క, కిషన్, నాయకులు ఠాగూర్ మచ్చర్ల రాజన్న ఆకుల గంగన్న, పీడీఎస్​యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్ అనిల్, అంకాపూర్ ప్రజలు పాల్గొన్నారు.