HomeతెలంగాణBodhan Government Hospital | బోధన్​ ఆస్పత్రిలో బంధువులే వార్డ్​బాయ్​లు

Bodhan Government Hospital | బోధన్​ ఆస్పత్రిలో బంధువులే వార్డ్​బాయ్​లు

- Advertisement -

అక్షరటుడే, బోధన్​:Bodhan Government Hospital | పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి(Government Hospital) పరిస్థితి రోజురోజుకూ అధ్వానంగా మారుతోంది. ఆస్పత్రిలో కనీస వసతులు లేకపోవడంతో రోగులు(Patients), వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం పట్టణానికి చెందిన గంగాధర్​ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. కుటుంబీకులు వెంటనే పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ వార్డ్​బాయ్​లు(Ward boys) అందుబాటులో లేక బాధిత బంధువులే అతడిని వీల్​చైర్​లో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారు. ఆస్పత్రిలో 12మంది వార్డ్​బాయ్​లు ఉండగా.. ఒక్కరు కూడా అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.