అక్షరటుడే, ఇందూరు: IRAD | ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ అండ్ డేటా బేస్ (Integrated Road Accident and Data Base) అప్లికేషన్లో జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ అధికారి మధు తెలిపారు.
గత నాలుగు సంవత్సరాలుగా ఈ అప్లికేషన్ పోలీసు, రవాణా, రహదారుల విభాగాలకు ప్రమాదాలకు గల కారణాలు, విశ్లేషణను అందిస్తుందన్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో (Telanagana) మొదటిసారిగా జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులకు అవకాశం కల్పించామన్నారు. దీంతో రోడ్డు ప్రమాదానికి సంబంధించిన మెడికో లీగల్ సర్టిఫికెట్ (Medico Legal Certificate), డిశ్చార్జి సమ్మరీ, పోస్టుమార్టం (Postmortem) రిపోర్టులు అప్లికేషన్లో పొందవచ్చన్నారు. బుధవారం జిల్లా నుంచి ప్రతిభ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (Pratibha Super Specialty Hospital), సాయి శుభ హాస్పిటల్, అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ వివరాలు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.