Homeజిల్లాలునిజామాబాద్​Non-Layout Plots | దర్జాగా నాన్​ లే అవుట్​ ప్లాట్ల రిజిస్ట్రేషన్​.. సబ్​ రిజిస్ట్రార్​ నిర్వాకం

Non-Layout Plots | దర్జాగా నాన్​ లే అవుట్​ ప్లాట్ల రిజిస్ట్రేషన్​.. సబ్​ రిజిస్ట్రార్​ నిర్వాకం

నిజామాబాద్​ అర్బన్​ రిజిస్ట్రేషన్​ కార్యాలయం పరిధిలో నాన్​ లే అవుట్​ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు సైతం చేసి పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సబ్​ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్​ చేస్తున్నా.. అధికారులు చర్యలు చేపట్టడం లేదు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Non-Layout Plots | అక్రమ ప్లాట్ల రిజిస్ట్రేషన్​ కట్టడికి ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా.. ఫలితం ఉండడం లేదు.

తప్పనిసరిగా డీటీసీపీ అనుమతులు తీసుకోవాలని నిబంధన విధించింది. మరోవైపు నాన్​ లే అవుట్​ ప్లాట్లు (Non-Layout Plots) రిజిస్ట్రేషన్​ చేయొద్దని సబ్​ రిజిస్ట్రార్లను ఆదేశించింది. కానీ.. కొందరు సబ్​ రిజిస్ట్రార్లు అక్రమార్జనకు అలవాటు పడి దర్జాగా నాన్​ లే అవుట్​ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.

నిజామాబాద్​ అర్బన్​ రిజిస్ట్రేషన్​ కార్యాలయం (Registration Office) పరిధిలో పని చేస్తున్న సబ్​ రిజిస్ట్రార్లు నిబంధనలు ఏమీ లెక్కచేయడం లేదు. నాన్​ లే అవుట్​ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు సైతం చేసి పెడుతున్నారు. భూ భారతిలో (Bhu Bharati) ఉన్న భూమిని కేవలం నాలా పత్రం ఆధారంగా ప్లాట్లుగా రిజిస్ట్రేషన్లు చేసి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు సమాచారం. నగరంలోని రోటరీ నగర్ (Rotary Nagar) సమీపంలో గల 12 గుంటల వ్యవసాయ భూమికి ఇటీవల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి పెట్టారు. ఓ సర్వే నంబర్​లో పట్టాదారుకు భూ భారతిలో 12 గుంటల భూమి ఉండగా.. కేవలం నాలా పత్రాల సాయంలో ఏడు ప్లాట్లుగా విభజించారు. 8585, 8586, 8578, 8579 నంబర్లతో కలిగిన డాక్యుమెంట్లను అక్టోబర్​ 10న పూర్తి చేశారు.

Non-Layout Plots | కొరవడిన పర్యవేక్షణ

జిల్లాలోని సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయంలో అక్రమ లే అవుట్​లకు సంబంధించి దర్జాగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. నిజామాబాద్​లో (Nizamabad) డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్​ కార్యాలయాలు ఉన్నాయి. ఇరువురు అధికారులు ఉన్నప్పటికీ సబ్​ రిజిస్ట్రార్​లపై పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా నాన్​ లే అవుట్​ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు మూడు పువ్వులు, ఆరు కాయలు అన్న చందంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా అర్బన్​లో జరిగిన రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Must Read
Related News