ePaper
More
    HomeతెలంగాణRegistration Department | సాగని రిజిస్ట్రేషన్లు.. సబ్​ రిజిస్ట్రార్ల ఇష్టారాజ్యం..

    Registration Department | సాగని రిజిస్ట్రేషన్లు.. సబ్​ రిజిస్ట్రార్ల ఇష్టారాజ్యం..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Registration Department | రాష్ట్ర ప్రభుత్వం (state government) ఒకవైపు ఆదాయాన్ని పెంచుకునే పనిలో పడింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్​, ఎక్సైజ్​ తదితర శాఖల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు మార్గాలను అన్వేషిస్తోంది.

    ప్రత్యేకించి రిజిస్ట్రేషన్ల శాఖ (registration department) ద్వారా అధిక మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. కానీ.. కొందరు అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. ప్రత్యేకించి దరఖాస్తుదారులు స్టాంప్​ డ్యూటీ చెల్లించి మరీ స్లాట్​ బుక్​ చేసుకుని కార్యాలయానికి వెళ్లినా.. అధికారులు కావాలని రిజిస్ట్రేషన్​ ప్రక్రియ పూర్తి చేయకుండా వెనక్కి పంపడంపై విమర్శలు వస్తున్నాయి.

    Registration Department | తీరుపై విమర్శలు

    నిజామాబాద్​ అర్బన్​ సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయం (Nizamabad Urban Sub-Registrar office) పరిధిలో ఇదివరకు రోజుకు 70 వరకు డాక్యుమెంట్లు జరిగేవి. ఆదాయం కూడా దండిగా వచ్చేది. కాగా.. రియల్​ ఎస్టేట్​ రంగం (real estate sector) డీలా పడడంతో గతేడాది నుంచి ఆ సంఖ్య దాదాపు సగానికి తగ్గింది. కొద్ది నెలల నుంచి రోజుకు 45 నుంచి 50 వరకు డాక్యుమెంట్లు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న సబ్​ రిజిస్ట్రార్​ సెలవు పెట్టి వెళ్లారు. దీంతో ఇన్​ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

    READ ALSO  NEET Exam | నీట్ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు : సీపీ సాయిచైతన్య

    దరఖాస్తుదారులు సోమవారం పెద్దమొత్తంలో రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్స్​ బుక్​ చేసుకోగా.. దాదాపు అన్నింటిని కూడా అధికారులు తిప్పి పంపినట్లు సమాచారం. కేవలం మార్ట్​గేజ్​ దస్తావేజులు (mortgage documents) మాత్రమే పూర్తి చేసినట్లు తెలిసింది. కాగా.. రిజిస్ట్రేషన్ల కోసం దూర ప్రాంతాల నుంచి పలువురు అర్బన్​ కార్యాలయానికి వచ్చారు. తాము దూరం నుంచి వచ్చామని, ప్రక్రియ పూర్తి చేయాలని కోరినప్పటికీ.. ఇన్​ఛార్జి సబ్​ రిజిస్ట్రార్​ సీట్​లో కూర్చున్న ఓ అధికారిణి పట్టించుకోకపోవడం గమనార్హం. పైగా.. ‘తాను కేవలం మార్ట్​గేజ్​ డాక్యుమెంట్లు మాత్రమే చేస్తానని.. రెగ్యులర్​ రిజిస్ట్రేషన్లు (regular registrations) ఉంటే ఈ రోజు తన వద్దకు తేవద్దని సదరు అధికారిణి చెప్పడం’ కొసమెరుపు. ఒకవైపు ఆదాయం పెంచుకునేందుకు శాఖ ప్రయత్నిస్తుండగా.. మరోవైపు కిందిస్థాయి అధికారులు ఇలా వ్యవహరించడం గమనార్హం. దీనిపై ఉన్నతాధికారులు (higher officials) ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.

    READ ALSO  Nizamabad City | ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. నగర శివారులో ఘటన

    Latest articles

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    More like this