అక్షరటుడే, వెబ్‌డెస్క్: Colonel Sophia Qureshi : ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో కీలకంగా వ్యవహరించిన సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీ (Sophia Qureshi) పై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ వ్యవహారంలో ఆ మంత్రిపై కేసు నమోదు చేయాలని పోలీసులను మధ్యప్రదేశ్ హైకోర్టు Madhya Pradesh High Court ఆదేశించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ నాలుగు గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీని హైకోర్టు ఆదేశించినట్లు సమాచారం.
మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా Madhya Pradesh Minister Vijay Shah ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీ పేరును పరోక్షంగా వివాదాస్పదంగా ప్రస్తావించారు. ఉగ్రవాదులు మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేయగా.. వాళ్ల (ఉగ్రవాదుల) మతానికి చెందిన ఓ సోదరిని సైనిక విమానంలో మోడీజీ పంపించి గుణపాఠం చెప్పారని అన్నారు.
మంత్రి వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అటు జాతీయ మహిళా కమిషన్ (National Commission for Women – NCW) సైతం మంత్రి వ్యాఖ్యలను ఖండించింది. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వ్యక్తులు స్త్రీల పట్ల అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.
