HomeUncategorizedDonald Trump | ఇరాన్‌లో పాల‌న మార్పు! అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యాఖ్య‌లు..

Donald Trump | ఇరాన్‌లో పాల‌న మార్పు! అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యాఖ్య‌లు..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Donald Trump | ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడికి దిగిన త‌ర్వాతి రోజు ఆ దేశాధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇరాన్‌లో పాల‌న మార్పు గురించి ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇరాన్‌ను మ‌ళ్లీ గొప్ప‌గా చేయాలంటే పాల‌న మార్పు త‌ప్ప‌దేమో అని పేర్కొన్నారు. “ఇరాన్ పాల‌కులు మేక్ ఇరాన్ గ్రేట్(Make Iran Great Again) ఎగెయిన్ దిశ‌గా ప‌ని చేయ‌క‌పోతే.. నాయ‌క‌త్వ మార్పు ఎందుకు జ‌రుగ‌కూడ‌ద‌ని” ప్ర‌శ్నించారు. ఈ నేప‌థ్యంలో ఖ‌మేనీ(Khamenei)ని అంత‌మొందించాల‌న్న ఇజ్రాయెల్ ప్ర‌ణాళిక‌ల‌కు ట్రంప్ తాజాగా మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్లు భావిస్తున్నారు.

Donald Trump | ప‌ర‌స్ప‌ర విరుద్ధ ప్ర‌క‌ట‌న‌లు..

ఇరాన్(Iran) విష‌యంలో అమెరికా నుంచి ప‌ర‌స్ప‌ర విరుద్ధ ప్ర‌క‌ట‌న‌లు రావ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దాడులు ప్రారంభించిన స‌మ‌యంలో ఇరాన్‌లో పాల‌న‌ను కూల్చ‌డానికి ఈ దాడులు చేయ‌డం లేద‌ని, కేవ‌లం అణ్వ‌స్త్రాల త‌యారీని అడ్డుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా దాడులు చేసిన‌ట్లు ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా దాడులు చేసిన‌ట్లు ఉపాధ్యక్షుడు JD వాన్స్, అమెరికా ర‌క్ష‌ణ శాఖ మంత్రి పీట‌ర్ హెగ్సెట్ (US Defense Secretary Peter Hegsett), విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, జాయింట్ చీఫ్స్ ఛైర్మన్ జనరల్ డాన్ కెయిన్ వంటి అధికారులు తెలిపారు. కానీ, అందుకు విరుద్ధంగా ఇప్పుడు అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌క‌ట‌న చేయ‌డం అగ్ర‌రాజ్య వైఖ‌రిలో మార్పును సూచిస్తోంది. “‘పాలన మార్పు’ అనే పదాన్ని ఉపయోగించడం రాజకీయంగా సరైనది కాదు, కానీ ప్రస్తుత ఇరాన్ పాలన ఇరాన్‌ను మళ్లీ గొప్పగా చేయలేకపోతే, పాలన మార్పు ఎందుకు జరగదు ?” అని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో “MIGA!!!” నినాదాన్ని ఉద్ఘాటిస్తూ పోస్టు చేశారు. ఈ నేప‌థ్యంలో ఇరాన్‌పై అమెరికా మ‌రిన్ని దాడులు చేసే అవ‌కాశ‌ముంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Must Read
Related News